అవిసె గింజలతో మన శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవిసే గింజలలో ఫైబర్, మెగ్నీషియం, ఫాస్పరస్, థయామిన్, ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్స్ ఉంటాయని పేర్కొంటున్నారు. వీటిని ఫౌడర్ రూపంలో రోజు తీసుకోవడం వల్ల గుండెపోటును తగ్గించడంలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి డయాబెటీస్ రాకుండా అడ్డుకుంటాయని వివరిస్తున్నారు. అలాగే శిరోజాలు ఆరోగ్యంగా తయరవుతాయని తెలుపుతున్నారు.