Homeఫ్లాష్ ఫ్లాష్'వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు'

‘వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు’

– మరికొన్ని దారి మళ్లింపు

ఇదేనిజం, హైదరాబాద్‌ : మిచాంగ్‌ తుపాన్‌ ప్రభావంతో ఏపీ, తెలంగాణ సహా చెన్నైలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల తీవ్రతను బట్టి ఆయా ప్రాంతాల్లో వాతావరణ శాఖ అధికారులు రెడ్‌, ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్స్‌ జారీ చేశారు. ఈ క్రమంలో అప్రమత్తమైన రైల్వే శాఖ పలు రైళ్లు రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్‌ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడిరచారు. తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లను రద్దు చేయగా, ఇతర రాష్ట్రాల మీదుగా నడిచే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేయడం సహా మరికొన్నింటిని దారి మళ్లించినట్లు చెప్పారు. ప్రయాణికులు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

రద్దైన రైళ్లు ఇవే..

ఈ నెల 6న గుంటూరు – రేపల్లె (07784), రేపల్లె –గుంటూరు (07785), గుంటూరు - రేపల్లె (07786), రేపల్లె– తెనాలి (07873), తెనాలి – రేపల్లె (07874), రేపల్లె – తెనాలి (07875), తెనాలి – రేపల్లె (07876), రేపల్లె – గుంటూరు (07787) రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది.

అలాగే మంగళవారం నడవాల్సిన తెనాలి-రేపల్లె (07888), గుంటూరు - తెనాలి (07887) రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. అలాగే, ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ ముంబయి ఎల్‌టీటీ (12164) రైలును చెన్నై సెంట్రల్‌ తిరుత్తని మధ్య రద్దు చేసినట్లు చెప్పింది. కాచిగూడ - రేపల్లె (17625) రైలును గుంటూరు - రేపల్లె మధ్య రద్దు చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. బుధవారం నడవాల్సిన రేపల్లె– మార్కాపురం (07889) రైలును రేపల్లె – గుంటూరు మధ్య, సికింద్రాబాద్‌ –రేపల్లె (17645) రైలును గుంటూరు– రేపల్లె, రేపల్లె – సికింద్రాబాద్‌ (17626) రైలు రేపల్లె – గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు చెప్పారు. ఇక చెంగల్‌పట్టు ` కాచిగూడ (17651) రైలును దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. కంచీపురం – మేల్పాక్కం క్యాబిన్‌ మీదుగా మళ్లించినట్లు తెలిపింది. తాంబరం, చెన్నై ఎగ్మోర్‌, అరక్కొణం స్టేషన్లలో ఆగదని వివరించారు. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ – న్యూ జల్పైగురి (22611) రైలును రద్దు చేశారు. తిరుపతి – పూర్ణ (07610), తిరుపతి – ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ (16058) రైలును రద్దు చేశారు. తుపాను దృష్ట్యా ఇంతకు ముందు రద్దు చేసిన సికింద్రాబాద్‌ – గూడూరు (12710), తిరుపతి – లింగంపల్లి (12733), సికింద్రాబాద్‌ – తిరుపతి (12764), కాకినాడ టౌన్‌ – బెంగళూరు (17210) రైళ్లను పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img