ఇదేనిజం, కంగ్టి : అదనపు కట్నం తీసుకురావాలంటూ అత్తారింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన సోమవారం కంగ్టి మండల పరిధిలోని భీంరా గ్రామంలో చోటుచేసుకుంది. నాగన్ పల్లి గ్రామనికి చెందిన పొగుల సుజాత భర్త రవీందర్ రెడ్డి గారికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అయితే వారిలో రెండవ కూతురు పేరు పొగుల మహేశ్వరి (22) భీంరా గ్రామానికి చెందిన బోన్ డ్ల పండరీ రెడ్డి తండ్రి గంగారెడ్డి గారికి ఇచ్చి పెద్దల సమక్షంలో పెండ్లి 2022 లో చేసారు. ప్రస్తుతం మహేశ్వరి కి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా భర్త పండరీ రెడ్డి, మామా గంగారెడ్డి మరియు బావ బశిరెడ్డి ముగ్గురు కలసి మృతురాలు మహేశ్వరికి అదనపు కట్నం తీసుకొని రావాలని వేదించగ గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి సముదాయించారు కానీ వారు ముగ్గురు పద్దతి మార్చుకోక వేధింపులు అలాగే కొనసాగించారు. వారి వేధింపులు భరించలేక ఈరోజు ఉదయం 06.00 గంటల సమయంలో ఇంట్లో దులముకు ధోతితొ ఉరి వేసుకుని చనిపోయింది. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి ముగ్గురు పైన ఎస్సై విజయ్ కుమార్ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ డీస్పీ వెంకట్ రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కంగ్టి ఎమ్మార్వో ఆధ్వర్యంలో డీస్పీ శవపంచనమ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.