HomeతెలంగాణMarrige:వరుడు ఒక్కడే..వధువులు ఇద్దరు-వైభవంగా పెళ్లి

Marrige:వరుడు ఒక్కడే..వధువులు ఇద్దరు-వైభవంగా పెళ్లి

Marrige:వరుడు ఒక్కడే.. కానీ వధువులు ఇద్దరు. ముహూర్తం కూడా ఒక్కటే. ఒకేసారి ఇద్దరి వధువులకు తాళి కట్టి పెళ్లి చేసుకుని.. ఒక్కడు కాస్తా ముగ్గురయ్యారు. ఈ పెళ్లికి కుటుంబసభ్యులు కూడా అంగీకారం తెలపడం మరో విశేషం. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు వరుడు సత్తిబాబు. అంతకుముందు.. ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నట్లు వెడ్డింగ్ ఇన్విటేషన్లు కూడా ప్రింట్ చేసి మరీ పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానాలు పంపించడం హాట్‌ టాఫిక్‌గా మారింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ పెళ్లి.. ప్రస్తుతం స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. చర్ల మండలంలోని ఎర్రబోరు గ్రామానికి చెందిన సత్తిబాబు ఒకేసారి ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇలా చేసుకోవడం వెనుక ఒక కారణం వినిపిస్తోంది. సత్తిబాబు సునీత, స్వప్న కుమారి అనే ఇద్దరి అమ్మాయలను ప్రేమించాడు.

సంవత్సరం క్రితం నుంచి స్వప్న, సునీత ఇద్దరితో కలిసి సత్తిబాబు తన ఇంట్లో కాపురం చేస్తున్నాడు. అలాగే వారిద్దరికి ఒక్కో సంతానం కూడా జన్మించారు. అయితే సత్తిబాబు కోయ గిరిజన తెగకు చెందినవాడిగా తెలుస్తుంది. ఆ తెగకు చెందినవారు కొద్దిరోజులు కాపురం చేసిన తర్వాత పెళ్లి చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తోంది. సత్తిబాబుకు ఏడాది కాపురం చేసిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపించింది. అందుకే ఇప్పుడు బంధువులు, కుటుంబసభ్యులందరి సమక్షంలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నాడు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img