అక్కినేని వారి ఇంట్లో పెళ్లి సంబరాలు జరుగుతున్నాయి. రేపు అన్నపూర్ణ స్టుడియోస్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళల పెళ్లి జరగబోతుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతుంది. అయితే నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్నా విషయం తెల్సిందే. 2021లో వారి విడాకుల తరువాత, సమంతా వారి వివాహ ఫోటోలతో సహా చైతన్యతో ఉన్న అన్ని ఫోటోలను సోషల్ మీడియా నుండి తొలగించింది, అలాగే నాగ చైతన్య కూడా తమ పెళ్ళికి సంబందించిన ఫోటోలను డిలీట్ చేసాడు. కానీ ఒక ఫోటో మాత్రం నాగ చైతన్య అలానే ఉంచేసాడు.అదే వీరిద్దరూ కలిసి ఉన్న ‘మజిలీ’ సినిమా పోస్టర్‌ను నాగ చైతన్య తొలగించలేదు. అయితే నాగ చైతన్య ఆ ఫోటోను తొలగించకపోవడానికి కారణం ఏంటి అని నెటిజన్స్ చర్చించుకుంటారు. అయితే ఈ సినిమా తనకు చాలా స్పెషల్ అని నాగ చైతన్య చాలా సార్లు చెప్పాడు. అందుకేనా నాగ చైతన్య ఆ సినిమా పోస్టర్ ని సోషల్ మీడియా నుండి డిలీట్ చేయలేదు అని తెలుస్తుంది. అయితే రేపు పెళ్లి నాగ చైతన్య, శోభితా ధూళిపాళల పెళ్లి చేసుకోబోతున్నారు… ఈ క్రమంలో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.