Maruti Suzuki Baleno: మారుతి సుజుకి… భారత ఆటో మొబైల్ ఇండస్ట్రీలో ఈ పేరు ఎంతో ప్రత్యేకం. గల్లీ నుంచి దిల్లీ దాకా తమ వాహనాలతో వినియోగదారులను ఆకట్టుకుంది. అయితే మారుతి సుజుకి తీసుకున్న ఓ నిర్ణయం అందరిని షాక్ కు గురిచేసింది. కంపెనీ పాపులర్ మోడల్ అయిన బాలెనో ధరను పెంచుతున్నట్లు మారుతీ సుజుకి నిర్ణయం తీసుకుంది. వేరియంట్‌ను అనుసరించి రూ.9,000 ధరలో పెరుగుదల ఉంటుందని స్పష్టం చేసింది. సవరించిన ధరలతో బాలెనో రూ.6.70 లక్షల నుంచి ప్రారంభమై రూ.9.92 లక్షల (ఎక్స్ షోరూం) వరకు ఉంటుంది. ధరల పెరుగుదల డెల్టా ఏజీస్, జీటా ఏజీఎస్, అల్ఫా ఏజీఎస్ వేరియంట్లపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని మోటార్ నిపుణులు అంటున్నారు.