Homeఅంతర్జాతీయంసూసైడ్ బాంబర్ మాస్కోలో అరెస్టు

సూసైడ్ బాంబర్ మాస్కోలో అరెస్టు

భారత్‌లో ఉగ్ర దాడికి ఐఎస్‌ఎస్‌ ఉగ్రవాద సంస్థ కుట్ర చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న కీలక నేత హత్యకు ప్లాన్‌ చేసింది. దీని కోసం ఒక సూసైడ్ బాంబర్‌ను రంగంలోకి దించింది. అయితే ఆ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు రష్యా పేర్కింది. రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్‌ఎస్‌బీ) ఈ మేరకు సోమవారం ప్రకట‌న విడుద‌ల చేసింది. రష్యా న్యూస్‌ ఏజెన్సీ స్పుత్నిక్ ఈ విషయాన్ని వెల్లడించింది. రష్యాలో నిషేధించిన ఇస్లామిక్ స్టేట్ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ సభ్యుడిని రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్‌ఎస్‌బీ) గుర్తించి, నిర్బంధించినట్లు తెలిపింది. ఆ ఉగ్రవాది మధ్య ఆసియా ప్రాంతంలోని ఒక దేశానికి చెందినవాడని పేర్కొంది. ఆత్మాహుతి బాంబర్‌ తనను తాను పేల్చుకుని రాజకీయ నేతను హత్య చేసేందుకు ప్లాన్‌ చేసినట్లు వెల్లడించింది. ఎఫ్‌ఎస్‌బీ నిర్బంధించిన ఆ వ్యక్తిని ఆత్మాహుతి బాంబర్‌గా టర్కీలో ఐఎస్‌ఐఎస్‌ రిక్రూట్ చేసినట్లు వివరించింది

Recent

- Advertisment -spot_img