మీకు రేషన్ కార్డు ఉందా.. అయితే ఒక్కటి మాత్రం కచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే అనర్హుల రేషన్ కార్డులు రద్దవుతున్నాయి. వారి పేర్లు తొలగిస్తున్నారు. ఐతే మీకు రేషన్ కార్డు ఉంటే.. ఆ కార్డు ఉందా? లేక పేర్లు తొలగించబడ్డాయా? తెలుసుకోవడం మంచిది. చనిపోయిన వారు, పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్లిన వారి పేర్లు, స్థానికంగా లేని వారి పేర్లను తొలగిస్తున్నారు. వీరికి బియ్యం పంపిణీని నిలిపివేస్తూ పౌరసరఫరాల శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రేషన్ బియ్యం అక్రమాలను అరికట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనర్హులకు బియ్యం పంపిణీని నిలిపివేయాలని అధికారులకు గట్టి ఆదేశాలు జారీ చేసింది. రేషన్ కార్డు ఉన్నవారు ఖచ్చితంగా EKYC చేయాలి. వారు EKYC చేయకపోతే, వారి పేర్లు రేషన్ కార్డు నుండి తొలగించబడతాయి. EKYC డిసెంబర్ 31 వరకు చేయవచ్చు. తర్వాత నుంచి పేర్లు తొలగిపోతాయి. లేకుంటే బియ్యం, ఇతర ప్రభుత్వ పథకాలకు అర్హులు కావడంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇంకా EKYC చేయకపోతే, వెంటనే చేయండి.