పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. బీర్భూమ్ జిల్లాలోని బొగ్గు గనిలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బీర్భూమ్‌లోని లోక్‌పూర్ ప్రాంతంలో ఉన్న గంగారామ్‌చక్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొలీరీలో ఈ సంఘటన జరిగింది. ఈ పేలుడు కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. పక్కనే పార్క్ చేసిన వాహనాలను కూడా ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.