జైపూర్ రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈ ఉదయం పెట్రోల్ పంపు వెలుపల ట్రక్కు ఢీకొనడంతో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు. అజ్మీర్ రోడ్డులోఈ ఘటన చోటు చేసుకుంది, ట్రక్కు ఇతర వాహనాలను ఢీకొనడంతో పెట్రోల్ పంపు సమీపంలో ఆగి ఉన్న సిఎన్‌జి ట్యాంకర్‌లో మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో 35 మందికి పైగా గాయపడ్డారు మరియు 40 వాహనాలు దగ్ధమయ్యాయి. 28 మంది బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.