నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని భారీ చోరీ జరిగింది. ఆరో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దొంగతనం చేశారు. ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తోన్న ఓ వ్యక్తి నుంచి దుండగులు రూ.12.80లక్షలు దొంగలించారు. ముంబయి నుంచి జగిత్యాలకు వచ్చే ప్రైవేటు బస్సులో జగిత్యాలకు చెందిన హనుమంతు ప్రయాణిస్తున్నాడు. నిజామాబాద్ శివారులోని సారంగాపూర్‌లో వద్ద టీ తాగడానికి బస్సు ఆపారు. ఇదే అదునుగా దుండగులు బాధితుడి నగదు బ్యాగును చోరీ చేశారు.
బస్సులో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ చేయి అడ్డుపెట్టి చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. చోరీకి గురైన బ్యాగ్‌లో రూ.12.80 లక్షలు ఉన్నట్లు బాధితుడు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.