Homeహైదరాబాద్మైలర్​దేవ్​పల్లిలో భారీ చోరీ

మైలర్​దేవ్​పల్లిలో భారీ చోరీ

శంషాబాద్​, ఇదేనిజం – మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో దొంగలు ఓ ఇంట్లో భారీ చోరీకి పాలుపడి పోలీసులకు సవాలు విసిరారు, మైలర్ దేవ్ పల్లి దుర్గ నగర్ ప్రాంతంలో గత నాలుగు రోజుల క్రితం ఇదే తరహాలో చోరీ జరిగింది, ఈ సంఘటన మరువవక ముందే దొంగలు మరొక ఇంటిని టార్గెట్ చేసి బంగారం, వెండి,నగదు ఎత్తుకెళ్లారు, ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం లోపు చోటు చేసుకోవడం శోచనీయం, పూర్తి వివరాల్లోకి వెళితే ఓం ప్రకాష్ అగర్వాల్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి దుర్గనగర్ లో ఉంటున్నాడు, ఓం ప్రకాష్ ఆగర్వాల్ కటేడాన్​లోని ఓ కంపెనీలో అకౌంటెనెట్ గా పని చేస్తూ ఉండగా, అతని భార్య ఇంటి వద్దే ఉంటుంది, ఇది ఇలా ఉండగా ఓం ప్రకాష్ ఉద్యోగానికి వెళ్లడంతో అతని భార్య పిల్లను తీసుకొని ఇంటికి తాళం వేసి కటేడాన్ లోని బందువుల ఇంటికి వెళ్ళింది, సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఓం ప్రకాష్ భార్య ఇంటికి వచ్చి చూడగా వేసిన తాళం వేసినట్లే ఉండగా మరొక తలుపులకు లోపలినుండి గడియ పెట్టి ఉండడంతో ఈ ఈ విషయాన్ని గ్రహించిన దొంగలు గడియను విరగొట్టి ఇంట్లోకి ప్రవేశించి అల్మారాలో దాచి ఉంచిన ఏడు తులాల బంగారం 400 గ్రాముల వెండి, 35,000 నగదు అపహరించుకుని పోయారు, ఈ విషయాన్ని గా గ్రహించిన కుటుంబ సభ్యులు మైలార్ దేవ్ పల్లి పోలీసులకు సమాచారం అందజేశారు, బాధితురాలి ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ఆధారంగా సంఘటన స్థలాన్ని పరిశీలించి వేలిముద్రలను సేకరించారు, తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు, ఓం ప్రకాష్ కూడా తన ఇంటి చుట్టు పక్కన ఉన్న వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img