తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అనేక జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41-44 డిగ్రీల మధ్య, మరికొన్ని జిల్లాల్లో 36-40 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. నేటి నుండి మరో 5 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని కూడా పేర్కొన్నారు. అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని, రక్షణ కోసం గొడుగులు తీసుకెళ్లాలని సూచించారు.