Homeజిల్లా వార్తలురంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక కు వినతి పత్రం ఇస్తున్న ఎంసీపీఐ (యూ) నాయకులు..

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక కు వినతి పత్రం ఇస్తున్న ఎంసీపీఐ (యూ) నాయకులు..

ఇదేనిజం,శేరిలింగంపల్లి: మియాపూర్ ప్రభుత్వ భూముల్లో  గత 30 సంవత్సరాలుగా నివాసాలు ఏర్పరుచుకొని  ఉంటున్న పేద ప్రజలకు ఇళ్ళకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ  ఎంసీపీఐ(యు) ఆధ్వర్యంలో రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసు ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు.  పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు తుడుం అనిల్ కుమార్ హాజరై  మాట్లాడుతూ.. మియాపూర్ ప్రభుత్వ భూముల్లో గత 30 సంవత్సరాలుగా నివాసాలు ఏర్పరుచుకొని ముజఫర్ అహ్మద్ నగర్ లో ఉంటున్నపేద ప్రజల ఇళ్ళకు గత నెల 27 నుండి హెచ్ఎండీఏ అధికారులు ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం అన్యాయమన్నారు.పెద్ద భూభకాసురులను వదిలి పేద వాళ్లకు నోటీసులు ఇచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం సరైన పద్ధతి కాదని   ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నోటీసులను తక్షణమే ఉపసహరించుకొని వారి ఇళ్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.
పార్టీ మియాపూర్ డివిజన్ కార్యదర్శి పల్లె మురళి మాట్లాడుతూ.. భూభాకాసురులు, కబ్జాదారుల పై గతంలో అనేక ఫిర్యాదులు చేశామని వాటిని కనీసం పట్టించుకోని అధికారులు పేదలపై ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేయడం తగదన్నారు. మియాపూర్ ప్రాంతంలో అనేక సంవత్సరాలు గా ఉంటున్న పెద ప్రజల బస్తీల జోలికి వొస్తే ఎంసీపీఐ(యు) రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తామని అదే విధంగా వాళ్లు ఇచ్చిన నోటీసులకు చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు. అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చామని వారు సానుకూలంగా స్పందించి స్థానిక  తహసీల్దార్ కు  సమస్యని రిఫర్ చేశారన్నారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ కార్యవర్గ సభ్యులు కుంభం సుకన్య, తుకారాం నాయక్, మహిళా సంఘ నాయకుల అంగడి పుష్ప,అనితా శివాని,సుల్తాన్ బేగం, రజియా బేగం, పార్టీ నాయకులు చందర్, కె.వెంకటేష్, కే.సుభాష్,స్థానిక బస్తి ప్రజలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img