Homeహైదరాబాద్latest Newsమేడారం హుండీ ఆల్ టైం రికార్డు

మేడారం హుండీ ఆల్ టైం రికార్డు

తెలంగాణ కుంభమేళా మేడారం సమక్క – సారక్క మహా జాతర వైభవంగా ముగిసింది. ఫిబ్రవరి 21 నుంచి 24వ వరకు నాలుగు రోజులపాటు రాష్ట్ర సర్కార్ ఆధ్వర్యంలో మహాజాతరకు దాదాపు కోటి 40 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు..తాజాగా జాతరలో భక్తులు అమ్మవార్లకు వేసిన కానుకల హుండీ లెక్కింపు ముగిసింది. ఎండోమెంట్, రెవెన్యూ, జాతర ట్రస్ట్ బోర్డు సభ్యులు సమక్షంలో హుండీలు తెరిచారు. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో పోలీస్ పహారా, సీసీ కెమెరాల నిఘా మధ్య హుండీలు లెక్కింపు కొనసాగింది. జాతర చరిత్రలో మునుపెన్నడూ లేనంత ఆదాయం లభించింది. బంగారు, వెండి కానుకలతో పాటు కరెన్సీ కట్టలు కోట్లలో లభించాయి. మేడారం జాతర హుండీ ఆదాయంలో ఆల్ టైం రికార్డు నమోదయింది. ప్రతీ మేడారం జాతరకు భక్తులు పెరుగుతున్న తరహాలోనే కానుకలు, హుండీ ఆదాయం కూడా పెరిగిపోతుంది. ఈసారి జాతరలో కోటిన్నర మంది భక్తులతో సరికొత్త రికార్డు నమోదుకాగా హుండీ ఆదాయం కూడా అదేస్థాయిలో రికార్డు నమోదైంది.

మేడారం జాతర హుండీ ఆదాయంలో ఇప్పటివరకు 2020 లో లభించిన 11 కోట్ల 64 లక్షల రూపాయల ఆదాయమే హైయెస్ట్ రికార్డుగా నమోదై ఉంది. ఆ జాతరలో ఒక కేజీ 63 గ్రాముల బంగారం, 53 కిలోల 450 గ్రాముల వెండి కానుకలు లభించాయి. ఆ రికార్డు ను బ్రేక్ చేస్తూ ఈసారి జాతరలో భారీఎత్తున ఆదాయం లభించింది. ఈసారి జాతరలో మొత్తం 540 హుండీలు ఏర్పాటు చేయగా హుండీల కౌంటింగ్ బుధవారంతో ముగిసింది. ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ఈసారి జాతరలో భారీగా ఆదాయం లభించింది. మొత్తంగా 13 కోట్ల 25 లక్షల 22 వేల 511 రూపాయల ఆదాయం లభించింది. 13 కోట్లకు పైగా ఆదాయం లభించడం ఇదే ప్రథమం. అయితే గత జాతరతో పోల్చితే కాస్త బంగారం కానుకలు తగ్గాయి. కానీ వెండి కానుకలు పెరిగాయి. కౌంటింగ్ ముగిసిన వెంటనే మేడారం పూజరులు, దేవాదాయ శాఖ సిబ్బంది సమక్షంలో బ్యాంక్ ఖాతాలో జమచేశారు. వచ్చిన ఆదాయాన్ని 1/3గా విభజించి పూజారులు, దేవాదాయశాఖకు పంచుతారు. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించడం పట్ల మేడారం పూజారులు సంతృప్తి వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img