Homeహైదరాబాద్latest Newsభక్తుల ఇంటికే మేడారం సమ్మక్క-సారలమ్మ ప్రసాదం

భక్తుల ఇంటికే మేడారం సమ్మక్క-సారలమ్మ ప్రసాదం

ఇదే నిజం, కోరుట్ల : భక్తుల సౌకర్యార్థం మేడారం సమ్మక్క-సారలమ్మ ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను నేరుగా భక్తుల ఇంటికి తెచ్చి ఇచ్చే సౌకర్యాన్ని టీఎస్ ఆర్టీసీ కార్గో సర్వీస్ అందిస్తుందని, మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ విజయ మాధురి తెలిపారు. అందుకోసం పేటియం యాప్‌లో ఈవెంట్స్‌లో నేరుగా 1 ప్రసాదానికి రూ.299 చెల్లించి బుక్ చేసుకోవచ్చని, అలాగే కార్గో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ద్వారా గానీ, బస్టాండ్‌లోని కార్గో ఏజెంట్ ద్వారా గానీ ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చని ఆమె చెప్పారు. మరిన్ని వివరములకు కోరుట్ల డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రమేష్‌ను 9154298572 ద్వారా స్పందించాలని కోరారు.

Recent

- Advertisment -spot_img