Homeహైదరాబాద్latest NewsMedchal District : మేడ్చల్ జిల్లా హత్యా కేసులో కీలక పరిణామం..!!

Medchal District : మేడ్చల్ జిల్లా హత్యా కేసులో కీలక పరిణామం..!!

Medchal District : మేడ్చల్ జిల్లాలోని (Medchal District) మునిరాబాద్ ప్రాంతంలో దారుణ సంఘటన జరిగింది. 25 ఏళ్ల మహిళను గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపారు. తరువాత, శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే మేడ్చల్ జిల్లాలో నమోదైన మిస్సింగ్ కేసులను పోలీసులు సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదు అని తెలిపారు. పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు అని తెలిపారు. అయితే ఆ యువతి చేతిపై మణి అనే వ్యక్తి టాటూ ఉందని, శ్రీకాంత్ అనే వ్యక్తి తెలుగులో, నరేందర్ అనే వ్యక్తి ఇంగ్లీషులో టాటూ ఉందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఆయన తెలిపారు.

Recent

- Advertisment -spot_img