మేడిపల్లి, ఇదే నిజం: టీఆర్ఎస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం మేడ్చల్ నియోజకవర్గం ప్రధానకార్యదర్శిగా మహేందర్ బాల్దెని నియమిస్తూ నియామక పత్రాన్ని జిల్లా కో- ఆర్డినేటర్ చాప భాస్కర్ యాదవ్ అందించారు. విలేకరుల సమావేశంలో మహేందర్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ నాపై పెట్టిన బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి పాటుపడతానని తెలియజేశారు, నా నియామకానికి సహకరించిన మంత్రి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి దర్గా దయాకర్ రెడ్డిలకు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు బుచ్చి యాదవ్, బచ్చ రాజు, పోచయ్య , సత్యనారాయణ, మల్లికార్జున్, చిరంజీవి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ టీఆర్ఎస్వీ ప్రధానకార్యదర్శిగా బాల్దె మహేందర్
RELATED ARTICLES