Ramoji Rao funeral
తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మీడియా మెఘల్ రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్ ఆయన చితికి నిప్పంటించారు. గౌరవ వందనం సూచికగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. రామోజీ ఫిల్మ్ సిటీలో స్వయంగా ఆయన కోరిక మేరకు నిర్మించిన స్మృతి కట్టడంలో అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియల్లో చంద్రబాబు, లోకేశ్, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఎన్వీ రమణ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.