హైదరాబాద్, ఇదేనిజం : వైద్య విద్యార్థిని లైగింక వేధింపులకు గురిచేసిన కేసులో యువకులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసు వివరాలు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ కథనం ప్రకారం… కర్ణాటక రాష్ట్ర్ట్రం బెంగుళూర్‌కు చెందిన విద్యార్థి(24) ఉక్రేయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తుంది. ఇదీలా ఉండగా సోమవారం ఉక్రేయిన్ నుంచి నగరానికి చేరుకుని నగరం నుంచి బెంగూళుర్ వేళ్లడానికి విమానం సమయం ఉండటంతో శంషాబాద్ వద్దనున్న వీజేఆర్ హోటల్ గది అద్దేకు తీసుకుంది. అయితే అదే హోటల్లో ఉన్న యువకులు ప్రవీణ్‌కుమార్, పురెందర్కుమార్, విజయ్‌కుమార్, తదితరులు అమ్మాయిని వేధించడం మొదలు పెట్టారు. దీంతో వారి ఆగడాలను భరించలేని సదరు యువతి వేంటనే డయాల్100 కు ఫోన్ చెసింది. వేంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో విద్యార్థిని ఫిర్యాదుచేయడంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారిపై వివిధ సెక్షన్ల ప్రకారం (354,509,506,510 సెక్షన్ ప్రకారం) యాజమాని విద్యాకర్‌రెడ్డి, ఉద్యోగి మహేష్ తదితరులపై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు.
వైద్య విద్యార్థినిపై లైగింక వేధింపులు.. కేసులో యువకులు రిమాండ్..
RELATED ARTICLES