Meena : హీరోయిన్ మీనా బాలనటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె తన నటనా జీవితంలో 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మీనా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ సహా అనేక భాషల్లో నటించింది. ప్రస్తుతం మీనా సినిమాలతో పాటు, మీనా టీవీ రియాలిటీ షోలు చేస్తుంది. ఒక హీరో ప్రభు ఒకసారి మీనాను బెదిరించాడనే అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాని గురించి మీనా స్పందించింది. 1983లో విడుదలైన ”సుమంగళి” సినిమాలో మీనా బాలనటిగా నటించింది. ఈ సినిమాలో శివాజీ గణేషన్‌తో పాటు, ప్రభు కూడా చాలా నటించాడు. అయితే ఆ తరువాత మీనా ప్రభు సరసన ”రాజకుమారన్” సినిమాలో కథానాయికగా నటించింది. ఆ సమయంలో సెట్‌లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు జరిగాయి అని మీనా చెప్పింది. అప్పట్లో హీరో ప్రభుతో నేను మీతో బాలనటిగా చేశాను ఇప్పుడు మళ్ళీ మీతో హీరోయినిగా చేస్తున్నాను అని చెప్పను. దానికి ప్రభు వెంటానే తనను బెదిరించాడని మీనా చెప్పింది.మీనా బాలనటిగా, హీరోయిన్‌గా నటించింది కాబట్టి ఆమెకు నటుడు ప్రభు వయస్సు తెలుసు. ఎవరికీ చెప్పవద్దని అతను సరదాగా బెదిరించాడని మీనా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.