HomeతెలంగాణTS Cabinet Subcommittee meeting : ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సమావేశం

TS Cabinet Subcommittee meeting : ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సమావేశం

పోడుభూముల సమస్యలపై ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సమావేశం

Meeting of Telangana State Cabinet Sun Committee on Land issues : తెలంగాణలో ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్​లో ఉన్న పోడు భూముల సమస్యల పరిష్కారానికి సర్కార్ సమాయత్తమయింది.

పోడు భూముల సమస్యలపై  మంత్రివర్గ ఉపసంఘం(Ts Cabinet Subcommittee meeting) సమావేశమైంది.

మంత్రివర్గం ఏర్పాటైన తర్వాత తొలిసారి ఈ భేటీ జరిగింది.

రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు శాఖల మంత్రి సత్యవతి రాఠోడ్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ భేటీలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ హాజరయ్యారు. 

రెండు గంటలకుపైగా పోడు భూముల సమస్యలపై ఈ భేటీ(Ts Cabinet Subcommittee meeting)లో చర్చించారు.

పర్యావరణ పరిరక్షణ, అటవీ భూముల సంరక్షణ, ఆర్.ఓ.ఎఫ్.ఆర్ చట్టం అమలు, గిరిజనులు, గిరిజనేతరుల హక్కులు వంటి పలు అంశాలు ఈ సమావేశం(Ts Cabinet Subcommittee meeting)లో చర్చకు వచ్చాయి.  

ఆగస్టులో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్.. పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

హరితహారం సహా ఇతర కార్యక్రమాల్లో భాగంగా పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన ప్రతిసారి అధికారులు, రైతులకు మధ్య గొడవలు.. పలు సందర్భాల్లో దాడులు చోటుచేసుకుంటున్నాయి.

వీటికి అడ్డుకట్టే వేసి ప్రకృతిలో మమేకమై సాగు చేసుకునే రైతులకు అండగా ఉండటానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

కాగా వీటన్నింటిపై చర్చించేందుకు ఈ నెల 24న మరోసారి సమావేశం(Ts Cabinet Subcommittee meeting) కావాలని ఉపసంఘం నిర్ణయించింది. 

Recent

- Advertisment -spot_img