Homeహైదరాబాద్latest NewsMega 157 Movie : సంక్రాంతికి రఫ్ఫాడించేందుకు సిద్ధం..!!

Mega 157 Movie : సంక్రాంతికి రఫ్ఫాడించేందుకు సిద్ధం..!!

Mega 157 Movie : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ”మెగా 157” గురించి అభిమానుల్లో ఉత్కంఠ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ భారీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ నేడు ప్రారంభించారు. ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన షూటింగ్‌లో చిరంజీవి పాల్గొన్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమాని పక్క ప్లానింగ్ తో షూటింగ్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలనీ చూస్తున్నాడు. అనిల్ రావిపూడి గత సినిమాల్లోని వినోదాత్మక అంశాలు, అలాగే చిరంజీవి మార్క్ హీరోయిజంతో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో కేథరిన్ తెరిసా కీలక పాత్రలో నటిస్తుంది. ‘మెగా 157’ సినిమాతో చిరంజీవి, నయనతార, అనిల్ రావిపూడి కలిసి సంక్రాంతి 2026ని రఫ్ఫాడించేందుకు సిద్ధమవుతున్నారు.

Recent

- Advertisment -spot_img