స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ లో రామ్ చరణ్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి, RRR సినిమాని బాలీవుడ్‌లో ప్రమోట్ చేస్తూ, రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూ లో విరాట్ కోహ్లీ తనకు ఆదర్శమని చెప్పాడు. విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే వదులుకోనని కూడా అప్పట్లో వ్యాఖ్యానించాడు. ఎందరో క్రికెటర్లు, రాజకీయ నేతలు, సినీ హీరోలు, హీరోయిన్ల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్‌లు ఇటీవలే వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్స్‌గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్రికెటర్ల విషయానికి వస్తే మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ జీవితాలపై తెరకెక్కిన బయోపిక్‌లు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ తెచ్చుకున్నాయి.
ఇప్పుడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ కు రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కోహ్లి పాత్రలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించనున్నాడని సమాచారం. గతంలో ఇలాంటి వార్తలు రావడంతో చెర్రీ టీమ్ ఖండించింది. ఇందులో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అయితే కోహ్లీ బయోపిక్‌పై అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. విరాట్ జీవితంపై సినిమా తీస్తే అందులో చరణ్ పర్ఫెక్ట్ గా ఉంటాడని అంటున్నారు. అయితే తన క్యారెక్టర్‌లో కోహ్లీనే నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, నటన అంటే ఇష్టం కాబట్టి తన బయోపిక్‌లో కోహ్లీ నటించే అవకాశం ఉందని అంటున్నారు. విరాట్ భార్య అనుష్క నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు. కోహ్లీ పాత్రలో నటించే అవకాశం ఇతరులకు రావడం కష్టమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చరణ్ ఆ పాత్రలో కనిపిస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం అంటున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్.