Homeహైదరాబాద్latest Newsఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మెగా హీరో ..?

ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మెగా హీరో ..?

మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని టాక్ నడుస్తుంది. అయితే సాయి ధరమ్ తేజ్ ఓ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ హీరోయిన్ పేరు మెహ్రీన్.. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్, హీరోయిన్ మెహ్రీన్ ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో వీరిద్దరూ కలిసి ‘జవాన్’ సినిమాలో నటించారు. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
“కృష్ణగాడి వీర ప్రేమగాథ” సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ ఫిర్జాదా. ఈ భామ తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టింది. ఆ మధ్య మెహ్రీన్ భవ్య బిష్టోయ్‌తో ప్రేమాయణం నడిపింది. ఆ సమయంలోనే ఆమె తన ప్రియమైన భవ్య బిష్టోయ్‌తో నిశ్చితార్థం చేసుకుంది. అయితే సడన్ గా ఏం జరిగిందో తెలియదు కానీ అతడితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది. ఎలాంటి కారణం చెప్పకుండానే భవ్య బిష్టోయ్‌తో పెళ్లి రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఆమె ఓ మెగా హీరోతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ ప్రచారంపై ఈ జంట ఎలా స్పందిస్తుందో చూడాలి.

Recent

- Advertisment -spot_img