Homeహైదరాబాద్latest Newsఎస్పీ అధ్వర్యంలో Mega Job Mela

ఎస్పీ అధ్వర్యంలో Mega Job Mela

ఇదే నిజం, కొమురం భీం ఆసిఫాబాద్ : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ పట్టణంలోని స్థానిక జూనియర్ కాలేజీలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం తేదీ 26.02.2024 ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు జరగనుంది. ఈ జాబ్ మేళాలో వివిధ రంగాలకు చెందిన సుమారు (50) బహుళ జాతీయ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు ఇవ్వనున్నాయి. 10th క్లాస్, ఇంటర్మీడియేట్ , పాలిటెక్నీక్, ఏదైనా డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, ఎంటెక్, ఫార్మసీ పూర్తిచేసిన నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకకోవాలని ఎస్‌పీ సురేష్ కోరారు. ఈ ఉద్యోగమేళాలో నెలకు రూ.18,000/- ల నుంచి రూ.75,000/-ల వరకు జీతం వచ్చే ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు. ఇతర వివరములకు స్థానిక పోలీస్ స్టేషన్ SIని సంప్రదించాలని, అలాగే పేరు, బయోడేటాను మీ సంబంధిత పోలీస్ స్టేషన్‌లలో నమోదు చేసుకోవాలని తెలిపారు.

Recent

- Advertisment -spot_img