Homeహైదరాబాద్latest Newsమెగా వ‌ర్సెస్ అల్లు వివాదం.. పవన్ తో అల్లు అర్జున్ భేటీ..?

మెగా వ‌ర్సెస్ అల్లు వివాదం.. పవన్ తో అల్లు అర్జున్ భేటీ..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ వ‌ర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ నడుస్తుంది. ఈ వివాదానికి తెరదించేందుకు అల్లు అర్జున్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడు.అయితే మరి ఆ నిర్ణయంతో ఫ్యాన్స్ వార్ కు ఎండ్ కార్డ్ పడుతుందా? అని చూడాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగితే.. ఆ విషయాన్ని పట్టించుకోకుండా.. నంద్యాలలో తన స్నేహితుడు, వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తరపున అల్లు అర్జున్ ప్రచారం చేయడం వివాదాస్పదమైంది. అప్పటి నుంచి మెగా అభిమానులకు, మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరమయ్యాడు. పుష్ప సినిమా కథ, అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ వరుస సమస్యలతో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ మొదలైంది.
డిసెంబర్ 5న పుష్ప2 సినిమా రిలీజ్ రానుంది..ఈ ఫ్యాన్ వార్ ఇలానే కొనసాగితే ‘పుష్ప 2’ మూవీ కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ స‌మ‌యంలో మూవీ మేక‌ర్స్ అల్లు అర్జున్‌ని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వివాదానికి స్వస్తి పలికేందుకు చర్యలు తీసుకోవాలని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో అల్లు అర్జున్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో అల్లు అర్జున్‌తో పాటు పుష్ప మూవీ మేకర్స్ కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img