Mega vs Allu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ (Mega vs Allu) మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడికి మద్దతు ఇవ్వడంతో మెగా vs అల్లు వివాదం చోటు చేసుకుంది. అలాగే కుటుంబంలోని అంతర్గత కలహాలు అక్కడక్కడా బహిరంగంగా వెల్లడయ్యాయి. గతంలో అల్లుఅర్జున్ ని ఉద్దెశించిపవన్ కళ్యాణ్, వరుణ్ తేజ, నాగ బాబు హాట్ కామెంట్స్ చేసారు. అయితే తాజాగా అల్లు అరవింద్ కూడా మెగా ఫ్యామిలీ ని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేసారు.
ప్రస్తుతం ఒక ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ”తండేల్” సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా అల్లు అరవింద్.. రామ్ చరణ్ డెబ్యూ మూవీ ”చిరుత” యావరేజ్ గా ఆడింది అని అన్నారు. అయితే తానే రాజమౌళితో మాట్లాడి ”మగధీర” లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా ఇచ్చాను అని అన్నారు. అలాగే ఇటివేలే ఒక ఈవెంట్‌లో కూడా ”గేమ్ ఛేంజర్” సినిమా ప్లాప్ అని అన్నారు. దీంతో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీ మధ్య దూరం మరింత పెరిగిందని అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. అయితే తాజాగా తాను చేసిన వ్యాఖ్యలు పై అల్లు అరవింద్ స్పందించారు. ”గేమ్ ఛేంజర్” సినిమా గురించి అడిగితే నో కామెంట్స్ అని అల్లు అరవింద్ అన్నారు. దీంతో అల్లు అరవింద్ కావాలనే మెగా ఫ్యామిలీని ఉద్దేశించి ఆలా మాట్లాడినట్లు తెలుస్తుంది.