Homeహైదరాబాద్latest Newsమెగా vs అల్లు.. మరోసారి రివీలైన మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య యుద్ధం.. ఏం జరిగిందంటే..?

మెగా vs అల్లు.. మరోసారి రివీలైన మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య యుద్ధం.. ఏం జరిగిందంటే..?

ఏపీలో బుధవారం నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ వేడుకను చూసేందుకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. కానీ అల్లు ఫ్యామిలీకి సంబంధించి ఒక్కరు కూడా ఈ వేడుకలో కనిపించలేదు. దీంతో ఈ రెండు ఫ్యామిలీల మధ్య వార్ నడుస్తుందని అంతా మాట్లాడుకుంటున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటన ముగించుకుని అన్నయ్య చిరంజీవి ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్.. తన అన్న చిరంజీవికి, వదిన సురేఖమ్మకు.. అలాగే అమ్మ అంజనాదేవి కాళ్లకి నమస్కరించి, ఆశీస్సులు తీసుకున్నారు. అయితే, మెగా ఫ్యామిలీలో ఏ చిన్న సెలబ్రేషన్ జరిగినా షేర్ చేసుకునే అల్లు ఫ్యామిలీ ఈ సందర్భంలో మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో ఈ రెండు ఫ్యామిలీల మధ్య అంతర్యుద్ధం నడుస్తుందనేది మరోసారి స్పష్టమైందని అంతా మాట్లాడుకుంటుండటం గమనార్హం.

Recent

- Advertisment -spot_img