Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) 69 ఏళ్ల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం చిరంజీవి ”విశ్వంభరా” అనే సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే మెగాస్టార్ తన కొత్త సినిమాని సక్సెఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో అనౌన్స్ చేసాడు. ప్రస్తుతం మెగాస్టార్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో అనిల్ బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయా అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయినిగా బాలీవుడ్ బ్యూటీ ని సెలెక్ట్ చేసాడని సమాచారం. ఈ సినిమాలో మెగాస్టార్ తో పరిణితి చోప్రా కలిసి నటించబోతుంది. అలాగే మరో హీరోయినిగా అదితి రావ్ హైదరీ నటిస్తుంది అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ క్రమంలో ఈ సినిమాలో మెగాస్టార్ ఇద్దరు భామలతో కలిసి నటించబోతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి – అనిల్ కాంబినేషన్ లో రాబోయే సినిమాపై అంచనాలు పెరిగిపోయి. ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా కధ చిరంజీవి గత సినిమాలు ‘రౌడీ అల్లుడు’ సినిమా తరహాలో ఉంటుంది సమాచారం. అలాగే ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ కనిపించబోతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.