చిక్కడపల్లి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసుల అరెస్ట్ చేసారు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.అయితే ఈ వార్త తెలుసుకున్న మెగా స్టార్ చిరంజీవి కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకోనున్నారు. అయితే చిరంజీవిని పోలీస్ స్టేషన్‌కు రావొద్దని పోలీసులు అభ్యర్థించారు. దీంతో హీరో అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి దంపతులు చేరుకున్నరు. అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులను పరామర్శించేందుకు మెగాస్టార్ చిరంజీవి వెళ్లారు.