Homeహైదరాబాద్latest Newsఅమితాబ్ బచ్చన్ చేతులు మీదుగా 'ఏఎన్నార్ జాతీయ అవార్డు' అందుకున్నా మెగాస్టార్ చిరంజీవి

అమితాబ్ బచ్చన్ చేతులు మీదుగా ‘ఏఎన్నార్ జాతీయ అవార్డు’ అందుకున్నా మెగాస్టార్ చిరంజీవి

నేడు ‘ఏఎన్నార్ జాతీయ అవార్డు’ 2024 కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవికి 2024 సంవత్సరానికి గాను ‘ఏఎన్నార్ జాతీయ అవార్డు’ వరించింది. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ చేతులు మీదుగా చిరంజీవి ఆ అవార్డును అందుకున్నారు. ఈ వేడుకకు చిరంజీవి కుటుంబ సభ్యులు, నాగార్జున కుటుంబ సభ్యులు, పలువురు నటీనటులు, నిర్మాతలు, దర్శకులు హాజరయ్యారు. తన తండ్రి అక్కినేనిశ్వరరావు శత జయంతి సందర్భంగా నాగార్జున అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ వేడుకకు చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా హాజరయ్యారు.
అక్కినేని జాతీయ అవార్డు వేడుకకు అక్కినేని అఖిల్, అక్కినేని నాగ చైతన్య, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీదత్, నిర్మాత అల్లు అరవింద్, హీరోలు వెంకటేష్, నాని, రామ్ చరణ్, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Recent

- Advertisment -spot_img