Homeహైదరాబాద్latest NewsMegastar Chiranjeevi : అంత క్షేమం.. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు

Megastar Chiranjeevi : అంత క్షేమం.. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు

Megastar Chiranjeevi : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. సింగపూర్‌లోని ఆస్పత్రిలో పవన్ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ చికిత్స పొందుతున్నాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి మార్క్ శంకర్ గురించి ట్విట్ చేసారు. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి.. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు అని చిరు తెలిపారు.
రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు. నా తమ్ముడు తరపున, మా కుటుంబం తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం అని చిరంజీవి ట్వీట్ చేసారు.

Recent

- Advertisment -spot_img