megastar Chiranjeevi : స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నవిషయం అందిరికి తెలిసిందే. 2023లో ”లస్ట్ స్టోరీస్-2” అనే సిరీస్ చేస్తుండగా వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ ఏర్పండింది. త్వరలో వివాహం చేసుకుంటారు అని అందరూ అనుకుంటే ఈ జంటసడన్ గా విడిపోతున్నట్లు ప్రకటించారు. దాదాపు రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత వీరిద్దరూ విడిపోయారు.
ఈ క్రమంలో తమన్నా లవ్ బ్రేకప్ కి కారణం మెగాస్టార్ చిరంజీవి అని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. అయితే తమన్నా పెళ్లి ఏర్పాట్ల గురించి తన తండ్రి అడిగినప్పుడు, తమన్నా ఆసక్తి చూపలేదు. తనకు విజయ్ వర్మ పద్డతి నచ్చడం లేదు అని చెప్పింది. అతని ఒత్తిడి కారణంగా వారు మీడియా ముందు చాలాసార్లు కలిసి కనిపించడం ఆమెకు బాధగా అనిపించింది. అయితే మీరు విడిపోయిన విషయాన్ని మీడియాకు ఎప్పుడు చెబుతావు అని ఆమె తల్లిదండ్రులు అడిగినప్పుడు.. చెప్పాల్సిన అవసరం లేదని తమన్నా చెప్పింది. అయితే, ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకుని లవ్ బ్రేకప్ విషయాన్ని మీడియాకు వెల్లడిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. అయితే తమన్నా, చిరంజీవి కలిసి ”సైరా నరసింహ రెడ్డి”, ”భోళా శంకర్” అనే సినిమాల్లో నటించారు. అప్పటినుంచి తమన్నా, చిరంజీవి మధ్య స్నేహ బంధం ఏర్పడింది అని.. తమన్నా కు చిరంజీవి ఒక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.