డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు సంరద్భంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘కల్యాణ్‌బాబు.. ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చావు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. దీర్ఘాయుష్మాన్ భవ!’’అని ట్వీట్ చేశారు.