Homeహైదరాబాద్latest Newsపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీలో నటించనున్న మెగాస్టార్.. !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీలో నటించనున్న మెగాస్టార్.. !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ అనే సినిమా రాబోతుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేమిటంటే.. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు చిత్ర నిర్మాతల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

Recent

- Advertisment -spot_img