Homeహైదరాబాద్latest Newsతమ్ముడి కోసం ప్రచారానికి మెగాస్టార్.. ముహూర్తం ఫిక్స్..!

తమ్ముడి కోసం ప్రచారానికి మెగాస్టార్.. ముహూర్తం ఫిక్స్..!

రాజకీయాలకు దూరమైన మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ కోసం ఎన్నికల ప్రచారంలోకి దిగనన్నారు. చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ సినీ స్టార్లందరూ ప్రచారంలో పాల్గొననున్నారు. ఏపీలో మే 13న అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. అంటే సరిగ్గా 15 రోజుల టైమ్ మాత్రమే ఉంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. అధికార వైసీపీ.. టీడీపీ కూటమి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వై నాట్ 175 అంటూ సీఎం జగన్ జోరుగా ప్రచారం చేస్తుంటే జగన్ మోహన్ రెడ్డిని పదవి నుంచి దించుతామంటూ కూటమి హోరాహోరీగా ప్రచారం చేస్తుంది. అయితే అందరి దృష్టి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంపైనే ఉంది. ఇప్పటికే పిఠాపురంలో పలువురు సెలబ్రెటీలు పవన్ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ప్రచారం నిర్వహించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా జనసేన కోసం ప్రచారం చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని జనసేన నేత, నటుడు పృథ్వీ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

“మే 5వ తేదీన మెగాస్టార్ ప్రచారానికి వస్తున్నారు.. దుమ్ముదులిపేస్తారు. చిరంజీవి గారు ఇక్కడ అద్భుతమైన పరిపాలన రావాలి. కూటమి అభ్యర్థులు గెలవాలి అని చెప్పి ఆయన షూటంగ్ కూడా పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ నా తమ్ముడు.. జనసేన నా తమ్ముడి పార్టీ.. నా గుండెల్లో తమ్ముడు ఉంటాడు.. ప్రజల గుండెల్లో పవన్ కళ్యాణ్ ఉంటాడు అని చెప్పిన వ్యక్తి మెగాస్టార్. ఆయన మే 5 నుంచి మే 11 వరకూ ఎడతెరగని బహిరంగ సభలు నిర్వహిస్తారు. చూసుకోండి ఒక పక్క చంద్రబాబు నాయుడు.. మధ్యలో చిరంజీవి గారు.. అటు పక్కన పవన్ కళ్యాణ్.. అసలు ఆ సభ చూస్తుంటేనే జనాలు ఓట్లు గుద్దేస్తారు.” అంటూ పృథ్వీ చెప్పుకొచ్చారు.

Recent

- Advertisment -spot_img