ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల నామాపూర్ గ్రామానికి చెందిన దేవునిపల్లి నారాయణ ఇటీవల అనారోగ్య సమస్యతో బాధపడుతూ మృతి చెందాడు. వారి కుటుంబం రెక్కాడితే డొక్కాడని చాలా నిరుపేదలు.. ఆ కుటుంబానికి ముస్తాబాద్ ముదిరాజ్ మండల సంఘం ఆధ్వర్యంలో 5 వేలు రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిట్ల రాంగోపాల్ , జిల్లా ముదిరాజ్ సంఘ యూత్ అధ్యక్షులు గజ్జల రాజు , మండల ఉపాధ్యక్షులు గొడుగు శంకర్, గీస శంకర్, రంజాన్ రమేష్ ,సంఘ సభ్యులు, పెండం చంద్రం మందుల రాజు, చిట్టవేణి ప్రవీణ్ ,గొడుగు శేఖర్, పిల్లి ధర్మపురి, చిట్టవేణి ఎల్లయ్య, చిట్టవేణి దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.