ఇదేనిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ముస్తాబాద్ సభ్యుల ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ చేపట్టగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్సై గణేష్ విచ్చేసి వారి చేతుల మీదుగా భక్తులకు మట్టి వినాయకులను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎస్సై గణేష్ మాట్లాడుతూ చవతి పండుగ సందర్భంగా ప్రజలు, రసాయనాలతో చేసిన వినాయక ప్రతిమలు కాకుండా మట్టి వినాయకులను మాత్రమే పూజించాలని ఆయన కోరారు. మట్టి వినాయకులు వాడడం వల్ల నీటి కాలుష్యం ఉండదని, నీటిలో జీవరాసులకు ఏలాంటి హాని కలగదని, ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు మట్టి వినాయకులు ప్రతిష్టించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.