తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉదయం నుంచి భానుడు ప్రతాపం చూపడంతో జనం వణికిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. అయితే వేసవి ఎండలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఓ చల్లని వార్త చెప్పింది. ఈనెల 6 నుంచి కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్గొండ జిల్లా గూడపూర్ లో అత్యధికంగా 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది.