తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలకు ఛాన్స్ లేదని చెప్పారు. నవంబర్ 11వ తేదీ వరకు కూడా తెలంగాణలో పొడి వాతారవణమే ఉంటుందని చెబుతున్నారు. ఎలాంటి వర్ష సూచన లేదని తెలిపింది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉన్న ద్రోణి నైరుతి బంగాళాఖాతం మీదుగా కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.