హైదరాబాద్ మెట్రో క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది. ఈ రోజు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా అర్ధరాత్రి వరకు ఆ మార్గంలో మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి అని తెలిపింది. చివరి రైలు మధ్యాహ్నం 12:15 గంటలకు బయలుదేరి 1:10 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందని మెట్రో అధికారులు తెలిపారు. ప్పల్ స్టేడియం- ఎన్జీఆర్‌ఐ స్టేషన్లలో మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. మిగతా మార్గాలలో యథావిధిగా నడుస్తాయన్నారు.