Abortion is Womens Right : అబార్షన్ చేసుకునే వారిని శిక్షించడం రాజ్యాంగ విరుద్ధమని మెక్సికో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ఈ తీర్పును మిగతా న్యాయమూర్తులు కూడా పాటించాలని ఆదేశించింది.
గర్భస్రావం విషయంలో మహిళల హక్కులకు అనుకూలంగా గతంలోనే తీర్పునిచ్చిన ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది.
అబార్షన్ చేసుకునే వారిని శిక్షించడం రాజ్యాంగ విరుద్ధమని మెక్సికో అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.
చట్టంలోని నిబంధనలను ఏకపక్షంగా రద్దు చేయడం వల్ల గర్భస్రావం నేరంగా పరిగణిస్తున్నారని వ్యాఖ్యానించింది.
ఈ తీర్పు తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపిన కోర్టు.. దేశంలోని మిగతా న్యాయమూర్తులు కూడా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం మెక్సికోలోని నాలుగు రాష్ట్రాల్లోనే గర్భస్రావాన్ని అనుమతిస్తుండగా.. మిగతా 28 రాష్ట్రాల్లో కొన్ని మినహాయింపులతో జరిమానాలు విధిస్తున్నాయి.
గర్భస్రావం విషయంలో మహిళల హక్కులకు అనుకూలంగా మెక్సికో సుప్రీంకోర్టు గతంలోనే తీర్పునివ్వగా.. మెుదటిసారి గర్భస్రావాన్ని నేరంగా పరిగణించాలా? వద్దా? అని న్యాయమూర్తులు చర్చించినట్లు అక్కడి అధికారులు తెలిపారు.