Mi vs Gt : ఐపీఎల్ 2025లో భాగంగా నేడు అహ్మదాబాద్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. అయితే టాస్ ఓడిన గుజరాత్ మొదట బ్యాటింగ్ దిగింది.
ముంబై జట్టులో రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, ముజీబ్ ఉర్ రెహమాన్, సత్యనారాయణ రాజు ఉన్నారు. గుజరాత్ జట్టులో శుభమన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ ఉన్నారు.