Homeహైదరాబాద్latest NewsMI vs KKR : టాస్ గెలిచిన ముంబై.. ఫస్ట్ బ్యాటింగ్ కోల్‌కతా

MI vs KKR : టాస్ గెలిచిన ముంబై.. ఫస్ట్ బ్యాటింగ్ కోల్‌కతా

MI vs KKR : ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా నేడు వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడిపోయిన కోల్‌కతా బ్యాటింగ్ దిగింది.

ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన ముంబై ఇండియన్స్ తన మొదటి 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ముంబై ఈ సీజన్‌లో తొలిసారి సొంతగడ్డపై ఆడుతోంది. అయితే ఈసారి ముంబై విజయం సాధిస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అనారోగ్యం కారణంగా గత ఆటకు దూరమైన స్పిన్నర్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబైతో ఆడిన 11 మ్యాచ్‌ల్లో కోల్‌కతా కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించడం గమనార్హం.

Recent

- Advertisment -spot_img