Homeహైదరాబాద్latest NewsMI vs KKR: ఈ మ్యాచ్‌ లో ముంబై ఇండియన్స్ ఆ సెంటిమెంట్ కలిస్తుందా?

MI vs KKR: ఈ మ్యాచ్‌ లో ముంబై ఇండియన్స్ ఆ సెంటిమెంట్ కలిస్తుందా?

ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది.వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్ తో నేడు కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనుంది. వాంఖడే స్టేడియంలో ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ముంబై ఇండియన్స్‌ ఇప్పటి వరకు 10మ్యాచ్‌లు ఆడగా మూడింటిలో మాత్రమే విజయం సాధించింది. ఏడింటిలో ఓడిపోయింది. ప్రస్తుతం ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. గత మూడు మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్‌ జట్టు ఘోరంగా ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ పరాజయం పాలయ్యాయి. కోల్‌కత నైట్ రైడర్స్ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించింది. మూడింటిలో మాత్రమే ఓడిపోయింది. ప్రస్తుతం 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. నిజానికి వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ కు కాస్త ఊరట లభించే అవకాశం ఉన్న గేమ్ ఇది. గత ఏడు సీజన్లలో వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ముంబై ఇండియన్స్ ఎప్పుడూ ఓడిపోలేదు. చివరిసారిగా 2012లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఈ స్టేడియంలో ఓడిపోయింది.

Recent

- Advertisment -spot_img