Mid-day meal: వేసవి సెలవుల్లోనూ కరవు మండలాల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని ఏపీ హైకోర్టులో పిల్ వేశారు. అయితే కాకినాడకు చెందిన కీతినీడి అఖిల్ శ్రీగురుతేజ ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌లో, కరవు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు వేసవి సెలవుల్లో కూడా మధ్యాహ్న భోజనం అందించాలని అధికారులను ఆదేశించాలని కోరారు. 14 ఏళ్ల వయస్సు వరకు పిల్లలకు ఉచిత పోషకాహారం పొందే హక్కు ఉందని, ఈ పథకాన్ని ఏపీలోని 6 జిల్లాల్లో కరవు ప్రభావితమైన 87 మండలాల విద్యార్థులకు అమలు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.