Hyderabad : మరికాసేపట్లో చెన్నై – హైదరాబాద్ మ్యాచ్ జరగనుండగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. గేట్ నంబర్ 4 వద్ద పోలీసులకు, అభిమానుల మధ్య తోపులాట జరిగింది. టికెట్లు ఉన్నా పోలీసులు లోపలికి పంపడం లేదంటూ అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరు, చెన్నైతో పాటు దేశంలోని పలు నగరాల నుంచి వచ్చిన ధోనీ ఫ్యాన్స్. ధోనీ, ధోనీ అంటూ స్టేడియం లోపల, బయట ఉత్సాహ వాతావరణం నెలకొంది. స్టేడియం పరిసరాలు పసుపుమయంగా మారాయి.
మరోవైపు అభిమానులతో మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. అధికారులు ఇవాళ రాత్రి 12 గంటల వరకు హైదరాబాద్ మెట్రో సేవలను పొడిగించారు. 24 డిపోల నుంచి 60 ప్రత్యేక బస్సులను TSRTC నడుపుతోంది. స్టేడియం చట్టూ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో కొందరు సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.