చిన్న ధాన్యాలు (Millets) తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి, కాబట్టి డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే ఇవి మీ ఆరోగ్యానికి మేలు చేసే దివ్య ఔషధం. ఈ చిరుధాన్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
- కొర్రలు (Foxtail Millet): ఫైబర్ అధికంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ప్రోటీన్లు మరియు అమినో ఆమ్లాలను కలిగి ఉంటుంది.
- సజ్జలు (Pearl millet): అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
- అరికలు (Kodo Millets): యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల వాపును తగ్గిస్తుంది మరియు గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
- సామలు (Barnyard Millet): అధిక ఫైబర్, B కాంప్లెక్స్ విటమిన్లు, కాల్షియం మరియు ఐరన్‌ను కలిగి ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
- చామలు (Little Millet): ప్రోటీన్లు మరియు అమినో ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వల్ల అన్నం లేదా గోధుమలకు మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి.
- జొన్నలు (Sorghum Millet): సాంకేతికంగా ఇది మిల్లెట్ కానప్పటికీ, అధిక పోషక విలువలు కలిగి ఉండటం వల్ల దీనిని ఉపయోగిస్తారు. గ్లూటెన్-ఫ్రీ మరియు యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, మెగ్నీషియం మరియు ఐరన్‌ను కలిగి ఉంటుంది.
- రాగులు (Finger Millet): వీటిలో కాల్షియం మరియు ఫైబర్ ఎక్కువగా ఊడడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.