ఇదేనిజం, నారాయణఖేడ్: కొత్తగా ఏర్పడిన నారాయణఖేడ్ పండ్ల వ్యాపారుల యూనియన్ సభ్యులు గురువారం నారాయణఖేడ్ ఎంఐఎం అధ్యక్షులు న్యాయవాది మోహీద్ పటేల్‌ను, పార్టీ కార్యాలయంలో కలిసి, పండ్ల వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నారాయణఖేడ్‌లో పండ్ల మార్కెట్ లేకపోవడంతో మా వ్యాపారాన్ని రోడ్డు పక్కన తోపుడు బండి మీద నిర్వహించాల్సి వస్తోందని, దీనివల్ల చాలా సమస్యలను ఎదుర్కొంటున్నామని పండ్ల వ్యాపారులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా మోహీద్ పటేల్ మాట్లాడుతూ, పండ్ల వ్యాపారుల సమస్యలను అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని, త్వరలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నారాయణఖేడ్‌లో పండ్ల మార్కెట్ ఏర్పాటుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ పండ్ల వ్యాపారుల యూనియన్ సభ్యులు ఎంఐఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.